టీనేజర్ పై గ్యాంగ్ రేప్.. ఐదుగురు కన్నడ విద్యార్థుల అరెస్ట్

04-07-2019 Thu 13:02 | National
  • కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఘోరం
  • దళిత విద్యార్థినిపై నలుగురు విద్యార్థుల అత్యాచారం
  • వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన ఐదో విద్యార్థి
ఓ టీనేజర్ పై గ్యాంగ్ రేప్ కు సంబంధించిన కేసులో ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో మార్చి నెలలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ అత్యాచారానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా పోలీసు అధికారి మాట్లాడుతూ, బాధితురాలు దళిత సామాజిక వర్గానికి చెందినదని... ఆమె వయసు 19 ఏళ్లని చెప్పారు. ఓ ప్రైవేట్ కళాశాలలో బాధితురాలితో పాటు, దారుణానికి ఒడిగట్టిన విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. గ్యాంగ్ రేప్ తో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశామని చెప్పారు.

మార్చి మొదటి వారంలో నలుగురు విద్యార్థులు బాధితురాలిని కారులో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారని... అక్కడ కారులో నుంచి ఆమెను బయటకు లాగి, అత్యాచారం చేశారని పోలీసు అధికారి తెలిపారు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో షూట్ చేసి, ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని హెచ్చరించారని చెప్పారు. ముగ్గురు విద్యార్థులు అత్యాచారం చేస్తుండగా నాలుగో విద్యార్థి వీడియో తీశాడని తెలిపారు. అత్యాచారంతో సంబంధం లేని ఐదో విద్యార్థి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడని చెప్పారు. ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదు చేశామని తెలిపారు. మరోవైపు అత్యాచారానికి పాల్పడిన ఐదుగురిని కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ఈ వీడియోను ఎవరూ షేర్ చేయవద్దని కోరారు. ఎవరైనా షేర్ చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించారు.
teenagergang rapestudentsKarnatakadakshina kannada

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more